సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామంలో బుధవారం విజిలెన్స్ ఎస్సై రామారావు తన సిబ్బంది, మండల వ్యవసాయాధికారితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్న ఓ వ్యక్తి వద్ద రూ.5.33 లక్షల విలువచేసే అమూల్య గోల్డ్ వరి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే గ్రామంలో మరో ప్రైవేట్ ఎరువుల దుకాణంలో దాడులు చేసి 1334 యూరియా బస్తాలు ఉండాల్సిన చోట 1260 బస్తాలు మాత్రమే ఉండడంతో 74 బస్తాలు తేడా రాగా ఆ షాప్‌లోని 1260 బస్తాలు స్వాధీనం చేసుకుని 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


