● ఒకరి మృతి
● మరో ఆరుగురికి గాయాలు
భామిని: మండలంలోని బండ్రసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురుపాం మండలం ఆవిరి గ్రామానికి చెందిన కొండగొర్రి ఎల్లంగో(60) ప్రమాద స్థలంలోనే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆవిరి గిరిజన గ్రామం నుంచి భామిని వారపు సంతకు పశువుల కొనుగోలుకు ఆటోలో వస్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. బండ్రసింగి ఘాట్ రోడ్డులో అతివేగంగా వస్తున్న ఆటో బోల్తా కొట్టి లోయలోకి పడిపోయి నుజ్జునుజ్జయింది. ఈ నేపథ్యంలో అటోలో ప్రయాణిస్తున్న కొండగొర్రి ఎల్లంగో(60)తో మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కొండగొర్రి గంగారావు, కొండగొర్రి నగేష్, కొండగొర్రి సుమంతోలు తీవ్ర గాయాల పాలు కావడంతో 108 అంబులెన్స్‌లో తరలించి భామిని పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం తరువాత సీతంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్ బిడ్డిక కోరాతో పాటు బిడ్డిక కర్ణలు గాయాల పాలయ్యారు. సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని పాలకొండ డీఎస్సీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలసుకుని కేసు నమోదు చేశారు. ఎల్లంగో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తివ్వాకొండల్లోని ఘాట్ రోడ్లలో రక్షణగా రాతి కట్టలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజనులు డీఎస్పీ రాంబాబుకు ఫిర్యాదు చేశారు.
ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా
ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా