
తలగాం యువకుడి ప్రతిభ
వంగర: మండలంలోని తలగాం గ్రామానికి చెందిన పారిశర్ల అప్పలనాయుడు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో సత్తాచాటాడు. 167 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, జిల్లా స్థాయిలో మొద టి ర్యాంకు సాధించాడు. సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. యువకుడి తల్లిదండ్రులు సత్యంనాయు డు, హైమావతి వ్యవసాయ కూలీలు. డిగ్రీ విద్యను పూర్తిచేసిన కుమారుడు పోలీస్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. యువకుడిని మడ్డువలస కళాశాల ప్రిన్సిపాల్ రవిశంకర్, అధ్యాపకులు శుక్రవారం అభినందించారు.
ఒకేసారి ఐదు ఉద్యోగాలకు ఎంపిక
సంతకవిటి: మండలంలోని వాల్తేరు గ్రామానికి చెందిన వావిలపల్లి అనిల్‌కుమార్ ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తు తం తెలంగాణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన సివిల్, ఏపీఎస్పీ, నేవీ, సీఆర్‌పీఎఫ్, అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికై నట్టు తెలిపాడు. ముందుగా తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు వెలువడడంతో విధుల్లో చేరానని, ఏపీలో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరుతానని తెలిపాడు.
కూలి కుటుంబంలో ఉద్యోగాల పంట
లక్కవరపుకోట: మండలంలోని కొట్యాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ముమ్మన గోవింద, ప్రసాద్‌లు శుక్రవారం విడుదలైన పోలీస్ పరీక్ష ఫలితాల్లో ఏఆర్ కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు. డిగ్రీ పూర్తిచేసిన వీరిద్దరూ కొన్నినెలలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సాధన చేస్తున్నారు. ఇద్దరికీ ఒకే సారి ఉద్యోగాలు రావడంతో కూలీలైన తల్లిదండ్రులు ముమ్మన రమణ, సత్యవతి సంతోషం వ్యక్తంచేశారు.

తలగాం యువకుడి ప్రతిభ

తలగాం యువకుడి ప్రతిభ