
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
వేపాడ: ఎంఈఓ–1 పోస్టులను కామన్ సర్వీస్ రూల్స్ ప్రాప్తికి నియమించాలంటూ పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సహాయకులతో పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లతో కామన్ సర్వీస్ రూల్స్ ప్రాప్తికి ఎంఈఓ పోస్టులు భర్తీచేయాలని కోరారు.
● విజయనగరం అర్బన్: ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ఎంఈఓ పోస్టులు భర్తీచేయాలని, కేవలం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వడం సరికాదని పీఆర్‌టీయూ, ఆపస్ పేర్కొన్నాయి. విధివిధానాలు పాటించాలని కోరుతూ డిప్యూటీ ఈఓ కేవీరమణకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డి.శ్రీనివాస్, బంకపల్లి శివప్రసాద్, కె.శ్రీనివాసరావు, బల్లా శ్రీనివాసరావు, చిట్టి రామునాయుడు, ఏజీ తాతారావు తదితరులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన