
● శ్రావణ శోభ
శ్రావణమాసం రెండో శుక్రవారం ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దచెరువు గట్టును ఆనుకుని ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి 60 కిలోల రాజమండ్రి రంగు పసుపు కొమ్ములతో అలంకరించగా, వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు బంగారు చీర, వజ్రకిరీటంలోను, చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి నిమ్మకాయలు, జామిలోని వాసవీమాత కరెన్సీ నోట్ల అలంకరణలో దర్శనమిచ్చారు.
– విజయనగరం టౌన్/ చీపురుపల్లి/జామి

● శ్రావణ శోభ