
వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకుడు
దత్తిరాజేరు: జనసేన విజయనగరం పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, గజపతినగరం నియోజకవర్గం నాయకుడు సామిరెడ్డి లక్ష్మణ్ ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో గురువారం చేరారు. ఆయన స్వగ్రా మం దత్తిరాజేరు మండలం పెదకాద నుంచి మరో 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ తీర్థం తీసుకున్నారు. మాజీ ఉప సర్పంచ్ మత్స వెంకన్న, సామిరెడ్డి తవిటినాయుడు, కూర్మినాయుడు, వైకంఠం శ్రీరాం తదితరులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన ఇంటివద్ద పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్షణ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క వైఎస్సార్‌సీపీలోనే సాధ్యమని, బొత్స అప్పలనరస య్య నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రిఅప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, వైఎస్ ఎంపీపీలు బమ్మిడి అప్పలనాయు డు, మిత్తిరెడ్డి రమేష్, నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మండల శ్రీను, చుక్క మురళి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
పెదకాద నుంచి సామిరెడ్డి లక్ష్మణ్‌తో పాటు 50 కుటుంబాలు చేరిక
పార్టీ కండువా వేసి ఆహ్వనించిన
మాజీ ఎమ్మెల్యే బొత్స