
పీ–4 కార్యక్రమం ఓ బూటకం
–8లో
అన్నదాత సుఖీభవలో కోత
రైతన్నకు పెట్టుబడి సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కొర్రీలతో లబ్ధిదారుల సంఖ్యకు
కోతపెడుతోంది.
రేగిడి: పేదరిక నిర్మూలనకోసం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ–4 కార్యక్రమం ఓ బూటకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ విమర్శించారు. రేగిడిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీ–4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, గ్రామస్థాయిలో పూర్తిగా అట్టర్‌ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. మార్గదర్శకులను గుర్తించకుండా బంగారు కుటుంబాలను గుర్తించాలని అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం మంచిది కాదన్నారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని వేధించడం తగదన్నారు. అట్టడుగున ఉన్న పేద ప్రజలను బాగుచేయాలనే మంచి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే కూటమి పార్టీల నాయకులే ఆ కుటుంబాలను దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు కాకపోవడం, ప్రజలు కూటమి నేతలను నిలదీస్తుండడంతో వారి దృష్టిని మరల్చడానికి పీ–4 కార్యక్రమం ముందుకు తెచ్చారన్నారు. గిన్నిస్‌బుక్ రికార్డు కోసం విశాఖలో ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డుల కోసం పీ–4 కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.