
పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
పత్రికల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే ఊరుకోం. దాడులతో జర్నలిస్టుల బాధ్యతను అడ్డుకోలేరు. జర్నలిస్టులపై దాడులే లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ తీరు సరైనది కాదు. వార్తలో తప్పుంటే ఖండించాలి. భయపెట్టే విధంగా క్రిమినల్ కేసులంటూ అరెస్టు నోటీసులు ఇవ్వడం దారుణం. కేసులు పెట్టి పత్రికలపై పెత్తనం చెలాయించాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం బయటకు రావాలి. జర్నలిస్టులపై ప్రభుత్వ తీరు మారకపోతే ఐక్యపోరాటాలు కొనసాగుతాయి.
– పీఎస్‌ఎస్‌వీ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి,
ఏపీయూడబ్ల్యూజే