దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి

Jan 15 2026 8:23 AM | Updated on Jan 15 2026 8:23 AM

దాడిత

దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి

బొబ్బిలి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీదాడితల్లి అమ్మవారిని తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ జూనియర్‌ సివిల్‌ జడ్జి మజ్జి లావణ్య బుధవారం దర్శించుకున్నారు. లావణ్య బొబ్బిలి వాస్తవ్యురాలు. స్థానిక సీనియర్‌ న్యాయవాది మజ్జి జగన్నాధం కుమార్తె. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన న్యాయమూర్తి స్థానిక దేవాలయాలను సందర్శించి కొలువై ఉన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆమె వెంట తల్లిదండ్రులతో పాటు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్వీ మురళీకృష్ణారావు, స్థానిక గొల్లపల్లి నాయకులు తుట్ట తిరుపతి, మండల జనార్థనరావు, పలువురు గ్రామ పెద్దలు ఉన్నారు.

మాజీ ఆర్మీ జవాన్‌కు సన్మానం

వంగర: మండల పరిధి కొప్పరలో కేఎన్‌ఎం ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్‌ఎం ట్రస్టు సభ్యులతో పాటు పలువురు ఆర్మీ ఉద్యోగులు సమష్టిగా ఇండియన్‌ ఆర్మీలో 22 ఏళ్లుగా ఎలక్ట్రానిక్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ విభాగంలో రాడార్‌ టెక్నీషియన్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన కనకం పట్నాన ముధుసూధనరావును ఘనంగా సత్కరించారు.

వరప్రసాద్‌కు అభినయ

రంగస్థల పురస్కారం

విజయనగరం టౌన్‌: గుంటూరు జిల్లా పొనుగుపాడులో ఈ నెల 11, 12, 13 తేదీలలో నిర్వహించిన అభినయ 20వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలలో జిల్లాకు చెందిన ప్రముఖ రంగస్థల నటులు, మూవీ ఆర్టిస్ట్‌ గెద్ద వరప్రసాద్‌ను అభినయ రంగస్థల పురస్కారంతో సత్కరించారు. నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు, అభినయ శ్రీనివాస్‌, మానాపురం సత్యనారాయణ, అనంతలక్ష్మి ఆధ్వర్యంలో సత్కారం, జ్ఞాపిక అందజేశారు. ఈ మేరకు జిల్లాకు చెందిన కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

నెల్లిమర్లలో పూరిల్లు దగ్ధం

నెల్లిమర్ల: పట్టణంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానిక యాతవీధిలోని పూరింట్లో బుత్తల లక్ష్మి తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఇంటికి నిప్పు అంటుకుంది. దీంతో ఇంటి లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని సామాన్లు కాలి బూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున సాయం అందజేశారు.

దాడితల్లి అమ్మవారిని  దర్శించుకున్న న్యాయమూర్తి 1
1/3

దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి

దాడితల్లి అమ్మవారిని  దర్శించుకున్న న్యాయమూర్తి 2
2/3

దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి

దాడితల్లి అమ్మవారిని  దర్శించుకున్న న్యాయమూర్తి 3
3/3

దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement