
అక్షరంపై దాడి సిగ్గుసిగు్గ
● పత్రికా స్వేచ్ఛను హరించడానికే
అక్రమ కేసులు
● కూటమి ప్రభుత్వ తీరుపై జర్నలిస్టు
సంఘాల నిరసన
విజయనగరం అర్బన్:
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు, నిజాలు ప్రచురించే పత్రికలపై కూటమి ప్రభుత్వం దాడులకు దిగడం, పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం సిగ్గుసిగ్గు అంటూ జర్నలిస్టు సంఘాలు నినదించాయి. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపాయి. సాక్షి దిన ప్రత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్తులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేయడాన్ని ఖండించాయి. విజయనగరం కలెక్టరేట్ గాంధీ బొమ్మ వద్ద శుక్రవారం పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, పత్రికా ప్రతినిధులు ఆందోళన చేశారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్యచేసిన ఉదంతాన్ని వెల్లడించినందుకు కేసులు నమోదు చేయడం విచారకరమన్నారు. ఇది అక్షరంపై దాడిచేయడమేనన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, అక్రమ కేసులను ఎత్తేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ వినతిని ప్రభుత్వానికి పంపుతానని చెప్పారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌ఎస్‌వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ఎన్ రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి వ్యాస్, వివిధ పత్రికల సంపాదకులు పంచాది అప్పారావు, కొల్లూరి జగన్నాథ శర్మ, వై.ఎస్.పంతులు, సాక్షి టీవీ జిల్లా బ్యూరో అల్లు యుగంధర్, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.
కేసులు తగవు
రాష్ట్రంలో పత్రికలకు స్వేచ్ఛలేకుండా పోయింది. రోజురోజుకీ జర్నలిస్టులపై ప్రభుత్వ దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘటనలను చూస్తూ జర్నలిస్టులు ఊరుకోరన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఏ పత్రికై నా ఇచ్చిన వార్తలో అసత్యాలుంటే న్యాయస్థానాలున్నాయి. వాటిని ప్రభుత్వం ఆశ్రయించాలే తప్ప క్రిమినల్ కేసులు పెట్టి పత్రికల స్వేచ్ఛను హరించేందుకు పూనుకోవడం అప్రజాస్వామికం.
– కొల్లూరి జగన్నాథశర్మ, జర్నలిస్టు
●

అక్షరంపై దాడి సిగ్గుసిగు్గ

అక్షరంపై దాడి సిగ్గుసిగు్గ