
● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి విజయనగరం ఆర్డీవో కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. సీఎం చంద్రబాబు సర్వేలతో కాలక్షేపం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్మి బూర వాసు, బలిజివీధి శాఖ కార్యదర్మి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకులు సూరీడమ్మ, ఏఐటీయూసీ నాయకులు ఆల్తి మరయ్య పాల్గొన్నారు.
– విజయనగరం గంటస్తంభం