8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నెల్లిమర్ల: మండలంలోని బుచ్చన్నపేట జంక్షన్‌లో ఉన్న కురమా కమల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల(19 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు ఆ విభాగం ఎస్సై రామారావు సిబ్బందితో కలిసి దాడిచేశారు. పట్టుబడిన బియ్యాన్ని బొప్పడాం రేషన్ డీలర్‌కు అప్పగించినట్లు సీఎస్‌డీటీ శంకరరావు తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కలిగి ఉన్న వ్యక్తిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
పెదబొండపల్లిలో..
పార్వతీపురం రూరల్: తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లిలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లగేజీ ఆటోను అదుపులోకి తీసుకుని 10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ డి. సింహాచలం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం ముగడ గ్రామం నుంచి వయా పెదబొండపల్లి మీదుగా ఒడిశాలోని అలమండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దారి కాచి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనలో పీడీఎస్ బియ్యంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పార్వతీపురం రూరల్ పోలీసులకు అప్పగించామన్నారు. దాడుల్లో పార్వతీపురం సీఎస్‌డీటీ ఎం.రాజేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో
రేగిడి పాఠశాల ప్రతిభ
రేగిడి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయస్థాయిలో చక్కని ప్రతిభ కనబరిచింది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్, న్యూఢిల్లీ అటల్ టింకరింగ్ ల్యాబ్, నీట్ ఆయోగ్‌తో సంయుక్తంగా ఆన్‌లైన్‌లో 2024–25 ఏడాదికి గాను స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు బూరవెల్లి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో సృజనాత్మకంగా రూపొందించిన సహజసిద్ధమైన హెయిర్‌డై ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. దేశంలో మొదటి 100 స్థానాల్లో ఈ ప్రొజెక్టుకు చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రొజెక్టులు ఎంపికకాగా అందులో రేగిడి ప్రొజెక్టు ఒకటి. ఈ ప్రొజెక్టును మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం మొదటి విడతగా రూ.35వేలు నిధులు విడుదల చేసిందని ఉపాధ్యాయిని ఉమా మహేశ్వరి తెలిపారు. ఈ ప్రాజెక్టును జూలై 29న ఢిల్లీలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, సైన్స్ అధికారి రాజేష్, జిల్లా సైన్స్‌ఫోరం ప్రతినిధులు సన్యాసినాయుడు, వేణుగోపాల్ తదితరులు ఉమామహేశ్వరిని అభినందించారు.
8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత


