18.37 లక్షల మంది ఓటర్లు.. 1,990 పోలింగ్ కేంద్రాలు ● కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ జి.విద్యాధరి తదితర అధికారులతో జరిగిన సమీక్షలో ఎన్నికల సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు రమేష్, రమణమూర్తి, వర్మ, నల్లనయ్య, సత్యవేణి, మేయర్ ఎన్నికల ఆర్వో దయానిధి, సీసీపీ ప్రభాకర్తో పాటు పోలీసు, జీవీఎంసీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మొత్తం ఓటర్లు 18,37,901 మహిళా ఓటరు 9,30,916 పురుష ఓటర్లు 9,06,866 ఇతరులు 119


