బీచ్‌రోడ్డు: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అంగన్‌వాడీ వింగ్ కార్యదర్శి గొలగాని లక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అనంతరం రాఖీ కట్టి హారతులు ఇచ్చారు. మహిళలకు వైఎస్సార్ అండగా నిలిచారని, ఆయన సంక్షేమ పథకాలు నేటికీ గుర్తున్నాయని నాయకురాళ్లు తెలిపారు. కార్యక్రమంలో పిన్నింటి పొలమ్మ, గుర్రమ మణి, కె. లక్ష్మి, సరోజని, సత్యవతి, తవుడమ్మ, పద్మ, జయ, కొండమ్మ వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


