మహామంత్ర భజనతో భక్తి పారవశ్యం | - | Sakshi
Sakshi News home page

మహామంత్ర భజనతో భక్తి పారవశ్యం

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

పీఎం పాలెం: వైజాగ్‌ కన్వెన్షన్‌ హాలులో శని వారం హరేకృష్ణ మహామంత్ర భజన కార్య క్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద లోకాలకు తీసుకెళ్లింది. నగరంలోని ‘హరేకృష్ణ మూవ్‌మెంట్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ‘మహామంత్ర భజన క్లబ్బింగ్‌’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సంకీర్తనలో ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే –హరేరామ హరేరామ రామ రామ హరేహరే’ అనే మహామంత్రాన్ని వివిధ సంగీత వాయిద్యాల మేళవింపుతో వీనులవిందుగా ఆలపించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ శ్రీమాన్‌ నిష్కించన భక్తదాస, యదురాజా దాస మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతత ద్వారానే భగవంతుని సన్నిధిని పరిపూర్ణంగా ఆస్వాదించగలమని పేర్కొన్నారు. విశ్వశాంతికి భగవన్నామ స్మరణ, భజనలే రాజమార్గమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement