మహారాణిపేట: దేశ నిర్మాణంలో ఉపాధి కల్పనకు తన నిబద్ధతను చాటుతూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) విశాఖలోని తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల రోజ్‌గార్ మేళా విజయవంతంగా ముగిసింది. ప్రధానమంత్రి రోజ్‌గార్ మేళా పిలుపునకు అనుగుణంగా జూన్ 23 నుంచి 25 వరకు హెచ్‌ఆర్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మందికి పైగా అభ్యర్థులు హాజరై ఫ్లీట్ సిబ్బంది విభాగాల పోస్టుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. డీసీఐఎల్ చైర్మన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఎండీ – సీఈఓ కెప్టెన్ ఎస్.దివాకర్ మార్గదర్శకత్వంలో ఈ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఛైర్మన్ జస్మీత్ సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన లక్ష్య సాధనలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ మాట్లాడుతూ సముద్ర రంగ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థవంతమైన సిబ్బందిని తీర్చిదిద్దేందుకు డీసీఐఎల్ ఇటువంటి నియామక కార్యక్రమాలను సంవత్సరం పొడవునా కొనసాగిస్తుందన్నారు. ‘వికసిత్ భా రత్’ లక్ష్య సాధనకు స ముద్ర శ్రామిక శక్తిని తీ ర్చిదిద్దే దిశగా ఈ మే ళా మైలురాయిగా నిలిచిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.


