బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

ఎంవీపీకాలనీ: అప్పుఘర్‌ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దౌలపిల్లి కనకరాజు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. గణేష్‌నగర్‌కు చెందిన కనకరాజు ఈ నెల 25వ తేదీ రాత్రి తన భార్య మందుల కోసం కాలినడకన మెడికల్‌ షాపునకు వెళ్లి తిరిగి వస్తుండగా, అప్పుఘర్‌ వద్ద

కై లాసగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ బైక్‌ అతడిని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కనకరాజును స్థానికులు 108 అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందాడు. బైక్‌ నడిపిన అదపాక శ్రీనుపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement