నంబర్‌–1 క్యాన్సర్‌ ఆసుపత్రిగా ‘మహాత్మాగాంధీ’ | - | Sakshi
Sakshi News home page

నంబర్‌–1 క్యాన్సర్‌ ఆసుపత్రిగా ‘మహాత్మాగాంధీ’

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

సీతంపేట: విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంజీసీహెచ్‌ఆర్‌ఐ) ప్రతిష్టాత్మక అవుట్‌లుక్‌ బెస్ట్‌ హాస్పిటల్‌ ర్యాంకింగ్‌–2026లో దేశంలోని ఉత్తమ క్యాన్సర్‌ ఆసుపత్రుల జాబితాలో 9వ స్థానం దక్కించుకుందని ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నంబర్‌–1 క్యాన్సర్‌ ఆసుపత్రిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా 2 లక్షలకుపైగా రోగులకు చికిత్స అందించడంతో పాటు 25 వేలకుపైగా ప్రధాన శస్త్రచికిత్సలు, 30 వేలకుపైగా రేడియేషన్‌ చికిత్సలు, 500కుపైగా రోబోటిక్‌ శస్త్రచికిత్సలు, 200కుపైగా బోన్‌మారో మార్పిడి చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ గుర్తింపు వైద్యులు, సిబ్బంది కృషికి, రోగులు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం చీఫ్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ స్టాలిన్‌ చౌదరి, సీనియర్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ పాత్రో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక క్యాన్సర్‌ చికిత్స విధానాలను వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement