పారిశుధ్య కార్మికుడిపై దాడి.. మృతి | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికుడిపై దాడి.. మృతి

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

ఎంవీపీకాలనీ: మద్యం మత్తులో ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన జీవీఎంసీ పారిశుధ్య కార్మి కుడు వి.అప్పారావు (58) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వన్‌టౌన్‌కు చెందిన కాసారపు పైడిరాజు (29) అనే యువకుడు గత మంగళవారం లుంబినీ పార్క్‌ సమీపంలో అప్పారావుపై వెనుక నుంచి కర్రతో బలంగా కొట్టి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అప్పారావును స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. జీవీఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు పైడిరాజును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement