రాష్ట్ర స్థాయి షూటింగ్‌లో విశాఖ కుర్రాడికి 5 పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి షూటింగ్‌లో విశాఖ కుర్రాడికి 5 పతకాలు

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

బీచ్‌రోడ్డు: గచ్చిబౌలి లోని సాట్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన 26వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి షూటింగ్‌ పోటీల్లో విశాఖకు చెందిన యువ క్రీడాకారుడు నాసిర్‌ అలీ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఎయిర్‌ స్మాల్‌ బోర్‌, షాట్‌ గన్‌ ఈవెంట్లలో పాల్గొన్న నాసిర్‌ అలీ.. తన కచ్చితత్వంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి 2 బంగారు, 2 వెండి, 1 కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను కై వసం చేసుకున్నాడు. ఈ నెల 20న జరిగిన ఈ పోటీలలో నిరంతర సాధన, క్రమశిక్షణతో రాణించిన నాసిర్‌ అలీని పలువురు ప్రముఖులు, క్రీడా నిపుణులు అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి కీర్తి తీసుకురావడమే తన లక్ష్యమని నాసిర్‌ అలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement