మహారాణిపేట: పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసి, పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కే.కే.రాజు మాట్లాడుతూ యువజన, విద్యార్థి, మహిళ, కార్మిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర విభాగాలు పార్టీకి వెన్నెముక వంటివని, ఇవి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రతి అనుబంధ సంఘం నెలవారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, మండలాలు, సచివాలయాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఒకే కుటుంబంలా ఐక్యంగా పనిచేస్తూ, ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ జిల్లా కార్యాలయం పర్యవేక్షకుడు రవి రెడ్డి, పార్టీ నేతలు సతీష్ వర్మ, కట్టమూరి సతీష్, బోని బంగారు నాయుడు, అల్లు శంకర్ రావు, రెయ్యి డేవిడ్ రాజు, కోమటి శ్రీనివాసరావు, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, కటారి అనిల్ కుమార్ రాజు, దొడ్డి రామనాథ్, ఆల్ఫా కృష్ణ, మనలత జోబ్దాస్ (చిన్ని), హరి కృష్ణారెడ్డి, గోవింద్, ఉరుకూటి రామచంద్రరావు, కోడిగుడ్ల పూర్ణిమ, రాయపురెడ్డి అనిల్ కుమార్, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, వంకాయల మారుతీ ప్రసాద్, వడ్డాది దీలీప్ కుమార్, సకలభక్తుల ప్రసాద్ రావు, దేవరకొండ మార్కెండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, నీలిరవి, చుక్క పైడి రాజు, రెడ్ల వేణు గోపాల కృష్ణ, దంతిని రామారావు, సాయిమోహన్ రావు, మానాపురం పట్నాయక్, ఎండీ షరఫీ, బోని శివరామకృష్ణ, కిరణ్ రాజు, జీలకర్ర నాగేంద్ర, దేముడు మాస్టర్, భద్రినాథ్, పద్మా రెడ్డి , లావణ్య, కృష్ణ పాల్గొన్నారు.


