ఏయూక్యాంపస్: సమంత ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌ను శుక్రవారం రాత్రి బీచ్‌రోడ్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక సమంత మాట్లాడుతూ.. సినిమాను ఆదరించి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సినీనటి గౌతమి మాట్లాడుతూ.. ‘మా ఇంటి బంగారాన్ని’ ప్రేక్షకులు తమ ఇంటి బంగారంగా భావించి ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డితో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ఆమె పంచుకున్నారు. నటీనటులంతా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఈ సినిమా చేశామని చెప్పారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకురాలు నందినీ రెడ్డి, సమంత భర్త, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు, సీనియర్ నటి శ్రీలక్ష్మి , చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు.


