ఆరిలోవ: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిపై కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన గ్లాస్ బ్రిడ్జి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిత్యం దీనిపై పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలోని సీతమ్మధారకు చెందిన 94 ఏళ్ల వృద్ధుడు సూర్యనారాయణమూర్తి తన మనవడితో కలిసి కై లాసగిరిని సందర్శించారు. అక్కడ ఎంతో ఎత్తులో ఉన్న గ్లాస్ బ్రిడ్జిపై ఆయన ఉత్సాహంగా నడుస్తూ సందడి చేశారు. బ్రిడ్జి అంచుల వరకు వెళ్లి ధైర్యంగా ఫొటోలు దిగారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిన ఉత్సాహాన్ని చూసి తోటి సందర్శకులు ఆశ్చర్యపోతూ, ఆయనను ఎంతగానో అభినందించారు.


