సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వద్ద ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కప్పస్తంభాన్ని జస్టిస్ నవీన్ చావ్లా ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో తిరుమలేశ్వరరావు ఆయనకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.


