అల్లిపురం: సిబ్బంది సంక్షేమంతో పాటు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 244 మంది పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి రివార్డు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. గురువారం నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన ఈ రివార్డులను పంపిణీ చేశారు. హోం గార్డుల నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ప్రతి నెలా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సిబ్బందిలో ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయని సీపీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకున్నవారు, చోరీ సొత్తు రికవరీ చేసిన దర్యాప్తు బృందాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకున్నవారు, సైబర్ క్రైమ్ కేసులను ఛేదించిన సిబ్బందికి ఈ రివార్డులు దక్కాయి.


