మూడో విడత చందనం అరగదీత ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మూడో విడత చందనం అరగదీత ప్రారంభం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూడో విడత చందనం అరగదీత కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 29న జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చిచందనాన్ని సమకూర్చేందుకు ఈ ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 20 మంది సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది. ఈ అరగదీత ప్రక్రియను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్‌, ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement