29న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విశాఖ రాక | - | Sakshi
Sakshi News home page

29న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విశాఖ రాక

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ నెల 29న విశాఖ రానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని నగరంలోని ఓ హోటల్‌లో బస చేస్తారు. 30వ తేదీన నగరానికి రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన అనంతరం, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు పుట్టపర్తికి బయలుదేరుతారు. అలాగే అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవి కోట శుక్రవారం విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని నగరంలో బస చేస్తారు. 27న శ్రీకాకుళం వెళ్లి రాత్రి అక్కడే బస చేయనుండగా, 28న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విశాఖకు చేరుకుని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement