డాబాగార్డెన్స్: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మధురవాడ వైజాగ్ కన్వెన్షన్‌లో ‘భజన క్లబ్బింగ్’పేరిట వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రతినిధి యదురాజ దాస తెలిపారు. గురువారం వీజెఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. విశాఖలో తొలిసారిగా సంకీర్తన మ్యూజిక్ బ్యాండ్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శక్తివంతమైన సంగీతం, కీర్తనలు, మంత్ర ధ్యానంతో పాటు సామూహిక నృత్యాల ద్వారా మానసిక ప్రశాంతత, విశ్వశాంతి చేకూర్చడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పేర్లు నమోదు కోసం 9100201291 నంబరులో సంప్రదించాలని కోరారు.


