పదోన్నతి పొందిన ఆరుగురు పోలీసులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

పదోన్నతి పొందిన ఆరుగురు పోలీసులకు సత్కారం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

అల్లిపురం: పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వివిధ హోదాల్లో పదోన్నతులు పొందిన ఆరుగురు సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ డా. శంఖబ్రత బాగ్చి గురువారం నగర పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో ర్యాంకులు, పోస్టింగ్‌ ఆర్డర్లను అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో ఒకరు ఏఆర్‌ ఎస్‌ఐగా, ఇద్దరు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఏఆర్‌ ఎస్‌ఐలుగా, ముగ్గురు ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్‌ పొందారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా సీపీ తెలిపారు. పదోన్నతి పొందిన సిబ్బందిని వారి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి, ఉన్నతాధికారులతో కలిసి నూతన ర్యాంకులను స్వయంగా తగిలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, పదోన్నతులు ఉద్యోగి సేవలకు లభించే గుర్తింపు మాత్రమే కాదని, మరింత బాధ్యతతో విధులు నిర్వహించేందుకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement