ట్రాలర్ నుంచి
జారిపడిన కంటైనర్
అర్ధరాత్రి కావడంతో
తప్పిన పెను ప్రమాదం
ఎన్‌ఏడీ జంక్షన్: ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ఫ్లైఓవర్‌పై గురువారం అర్ధరాత్రి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గాజువాక నుంచి తాటిచెట్లపాలెం వైపు వెళ్తున్న ఓ ట్రాలర్‌పై ఉన్న భారీ కంటైనర్ అదుపుతప్పి రహదారిపై జారిపడింది. పోలీసుల కథనం ప్రకారం.. దుంగల లోడు కంటైనర్‌తో వెళ్తున్న ట్రాలర్ ఫ్లైఓవర్ రోటరీ సమీపానికి చేరుకోగానే కంటైనర్ ఒక్కసారిగా ట్రాలర్ నుంచి జారిపడి రహదారిపై పడింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. అనంతరం క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించారు. ట్రాలర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


