ఘనంగా మనోజ్‌కుమార్‌ గ్రంధి జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మనోజ్‌కుమార్‌ గ్రంధి జయంతి

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

మహారాణిపేట: మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ లిమిటెడ్‌ (వైభవ్‌ జ్యువెలర్స్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మనోజ్‌కుమార్‌ గ్రంధి 60వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఏఎస్‌ రాజా వలంటరీ బ్లడ్‌ బ్యాంక్‌ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మందికి పైగా సిబ్బంది రక్తదానం చేశారు. అలాగే మ్యాక్సివిజన్‌ ఐ ఆస్పత్రి ఆధ్వర్యంలో 120 మందికి ఉచిత కంటి పరీక్షలు, మహాత్మా గాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రి–శ్రేయ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో 63 మంది మహిళా సిబ్బందికి ఉచిత హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ శిబిరాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ శశికిరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్‌పర్సన్‌ భారత మల్లికా రత్నకుమారి గ్రంధి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింధూరి, వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, వైభవ్‌ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement