ఎంవీపీకాలనీ: కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలపై ఎస్సీ యువతకు బుధవారం ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బుద్ధభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఎంఈజీపీ, పీఎం అజయ్, ముద్ర, పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా పథకాల కోసం వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలతో పాటు చిరు వ్యాపారాలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. అనంతరం నిర్వహించిన జాబ్ మేళాలో ఎస్సీ యువతీ, యువకులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూల ద్వారా పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీరిని ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


