ఆరిలోవ: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌టౌన్‌లోని జాలారిపేటకు చెందిన చింతపల్లి తాతాజీ (28) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై హనుమంతవాక మీదుగా జాతీయ రహదారిపై మధురవాడ వెళుతున్నాడు. జూపార్క్ సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో తాతాజీ కిందపడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


