కేర్‌లో 500 రోబోటిక్‌ మోకాలి శస్త్ర చికిత్సలు | - | Sakshi
Sakshi News home page

కేర్‌లో 500 రోబోటిక్‌ మోకాలి శస్త్ర చికిత్సలు

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

ఆరిలోవ: విశాఖలో కేర్‌ హాస్పిటల్స్‌లో గత ఏడాది 500 రోబోటిక్‌ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసినట్లు ఆసుపత్రి ఆర్థోపెడిక్‌ నిపుణుడు డాక్టర్‌ రవిచంద్ర వట్టివల్లి తెలిపారు. హెల్త్‌సిటీలో ఉన్న కేర్‌లో బుధవారం విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌లో కేర్‌ అగ్రగామిగా నిలిచిందన్నారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్‌, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక శస్త్ర చికిత్సలను కేర్‌లో అందిస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా నడవలేనివారు ఈ శస్త్ర చికిత్స తర్వాత సాధారణ జీవితం గడుపుతున్నారని వెల్లడించారు. వయసు పెరగడం, ఊబకాయం, మధుమేహం, వ్యాయామం లేకపోవడం, పాత గాయాలు, చికిత్సపై అలసత్వం తదితర కారణాలతో ఆర్థరైటిస్‌, కీళ్ల క్షీణత వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. రోబోటిక్‌ సాంకేతిక మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో ఖచ్చితత్వం ఉంటుందన్నారు. ఇది నొప్పిలేని శస్త్ర చికిత్స అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్‌ వైద్యులు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement