విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ పరీక్షలను వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి. చిట్టిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి నిర్వహించాల్సిన పలు కోర్సుల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు పరిపాలనా కారణాల రీత్యా వచ్చే నెలకు వాయిదా పడ్డాయి తెలియ జేశారు . బి.ఆర్క్, బి.టెక్, బి.టెక్+ఎం.టెక్, ఎం.టెక్, ఎం.ప్లానింగ్, ఎంఎస్సీ, బి.ఫార్మసీ, ఎం.ఏ., ఎంబీఏ, ఎం.కాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంసీఏ, మూడేళ్ల ఎల్.ఎల్.బి, ఐదేళ్ల బి.ఎ. ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, బి.ఎడ్ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ పరీక్షలు తొలుత 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పుడు కొత్త తేదీలకు మార్చారు. పరీక్ష తేదీ మాత్రమే మారిందని, పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. అన్ని పరీక్షలు యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తాజా షెడ్యూల్‌ను గమనించి, కొత్త తేదీలకు అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
కొత్త పరీక్ష తేదీలు ఇలా.......
బి.ఆర్క్ –జూలై 22, బి.టెక్, బి.టెక్+ఎం.టెక్–జూలై 22, ఎంఎస్సీ (అన్ని కోర్సులు) , జూన్ 30, బి.ఫార్మసీ– జూలై 15,ఎం.ఏ., ఎంబీఏ, ఎం.కాం, ఎంహెచ్‌ఆర్‌ఎం –జూలై 6, ఎంసీఏ–జూలై 6, మూడేళ్ల ఎల్.ఎల్.బి, ఐదేళ్ల బి.ఎ. ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం–ఆగస్టు 5, బి.ఎడ్ (ఒక సంవత్సరం), బి.ఎడ్ –జూలై 3


