సింహాచలం: వచ్చే నెల 28, 29 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించనున్నట్టు ఈవో జె. వెంకటరావు తెలిపారు. బుధవారం దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో పోలీస్, జీవీఎంసీ, విద్యుత్, ఫైర్, రెవెన్యూ, ఆరోగ్యశాఖ తదితర అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, విశ్రాంతి కేంద్రాలు, ప్రసాదాల పంపిణీ, మొబైల్ టాయిలెట్లు, అత్యవసర సేవల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు ఈవో సూచించారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై కూడా చర్చించారు.


