పికిల్‌బాల్‌ లీగ్‌ లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పికిల్‌బాల్‌ లీగ్‌ లోగో ఆవిష్కరణ

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర పికిల్‌ బాల్‌(ఏపీఎల్‌) లీగ్‌ విశాఖతో పాటు విజయవాడ వేదికలుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడనుండగా త్వరలో క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌, వేలం ప్రక్రియకు ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు,సెప్టెంబర్‌ మాసాల్లో ఈ లీగ్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్‌ క్రికెటర్‌ నితీష్‌కుమార్‌రెడ్డి స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో లోగోను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ నిర్వాహక కమిటీ ప్రతినిధి సుజయ్‌ కృష్ణా రంగారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement