ఓటర్లనే తమ వద్దకు రప్పిస్తూ... | - | Sakshi
Sakshi News home page

ఓటర్లనే తమ వద్దకు రప్పిస్తూ...

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

టర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు–చేర్పుల కోసం బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను అందజేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లాల్సింది పోయి, ఓటర్లనే తమ వద్దకు రప్పించుకుంటున్నారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ నాయకులు సూచించిన ప్రదేశాలకు వచ్చి ఫారాలు తీసుకోవాలంటూ కాలనీల వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాలనీ వాసులు ఫారాల కోసం నిర్దేశించిన ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement