పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీలకు కై లాష్‌రాజ్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీలకు కై లాష్‌రాజ్‌ ఎంపిక

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

మహారాణిపేట : ఈ ఏడాది జులై 5 నుంచి 8వ తేదీ వరకు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని జిమ్నాజియం హాల్లో జరిగే 14వ సీనియర్‌ నేషనల్‌ పెన్‌ కాక్‌ సిలాట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు విశాఖ విద్యార్థి అల్లాడ లిఖిల్‌కైలాష్‌ రాజ్‌ ఎంపికయ్యాడు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీసీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న కై లాష్‌ రాజ్‌ ఇటీవల ఒంగోలులో జరిగిన పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. సౌత్‌ జోన్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ దక్కించుకున్నాడు. కై లాస్‌ రాజ్‌ తండ్రి శివరాం ప్రసాద్‌ లీలామహల్‌ ఏరియాలో చిరు వ్యాపారి. 65–70 కేజీల విభాగంలో కై లాష్‌ రాజ్‌ ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రీడలో చేతులు, కాళ్లతోనే ప్రత్యర్థితో పోటీ పడి గెలవాలి. రామాయణంలో వాలీ, సుగ్రీవుల మధ్య జరిగిన యుద్ధాన్ని ఇండోనేషియా అభివృద్ధి చేసి పెన్‌ కాక్‌ సిలాట్‌గా నామకరణం చేసింది. ప్రస్తుతం ఏషియన్‌ గేమ్స్‌లో ఈ పోటీలను గుర్తించారు. ఈ పోటీలకు ఎంపికై న కై లాష్‌ రాజ్‌కు పెన్‌ కాక్‌ సిలాట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరావు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement