బీమా కార్మికులకు ఆశ్రిత ప్రయోజన పింఛన్లు అందజేత | - | Sakshi
Sakshi News home page

బీమా కార్మికులకు ఆశ్రిత ప్రయోజన పింఛన్లు అందజేత

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

సీతంపేట: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆశ్రిత ప్రయోజనం ఒక ముఖ్యమైన ప్రయోజనమని సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ కె.ఆర్‌.రవికుమార్‌ అన్నారు. ఉద్యోగ నిర్వహణ సమయంలో, ఉద్యోగ సంబంధిత ప్రమాదాల కారణంగా మరణించిన బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద నెలవారీ పింఛను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధిత ప్రమాదాల్లో మరణించిన గాజువాక ఈ.ఎస్‌.ఐ బ్రాంచ్‌ ఆఫీసు పరిధిలోని ముగ్గురు బీమా కార్మికుల కు టుంబ సభ్యులకు నగరంలోని ఈఎస్‌ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఆశ్రిత ప్రయోజనం కింద మంజూరైన పింఛను చెక్కులు అందజేశారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో పనిచేస్తూ వేగి వెంకట కృష్ణ గుండెపోటుతో మృతి చెందగా అతని భార్య, కుటుంబ సభ్యులకు నెలకు రూ.21,204లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరు చేశారు. నాగార్జున వైజాగ్‌ ప్రొఫైల్స్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న ఎం.నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని భార్యకు పార్వతికి నెలకు రూ.10,479 పెన్షన్‌ మంజూరు చేశామన్నారు. తులసి ఇంజినీరింగ్‌ వర్క్స్‌ సంస్థలో కాంట్రాక్ట్‌ ప్రతినిధిగా ఉక్కు కర్మాగారంలోని ఎంజీఎం యార్డ్‌లో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందిన కె.సూర్యారావు భార్యకు భవానికి నెలకు రూ.12,388లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరైందన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ కేఆర్‌ రవి కుమార్‌ మాట్లాడుతూ మృతి చెందిన బీమాదారుని భార్యకు నామమాత్రపు రుసుంతో ఏడాదికి రూ. 600 ముందస్తు చెల్లింపుతో ఈ.ఎస్‌.ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్స్‌లో వైద్య సదుపాయం, పిల్లలకు ఈఎస్‌ఐిసీ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లలో ప్రత్యేక కోటాకు అర్హత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో బెనిఫిట్స్‌ శాఖ అధికారి వేమూరి శ్యామ్‌ ప్రసాద్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కుమార్‌ సాహూ, గాజువాక ఈఎస్‌ఐ బీఎం పుచ్చల రమేష్‌ కుమార్‌, ఆయా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement