జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 107 వినతులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 107 వినతులు

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 107 వినతులు అందాయి. కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్‌ వర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదుల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 53 వినతులు రాగా, ఇంజనీరింగ్‌ విభాగానికి 25, రెవెన్యూ విభాగానికి 21 ఫిర్యాదులు వచ్చాయి. మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ నల్లనయ్య, జాయింట్‌ డైరక్టర్‌(అమృత్‌) డి.విజయభారతి, ప్రధాన ఇంజనీర్‌ సత్యనారాయణరాజు, కార్యదర్శి రమణ, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, డీసీఆర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ ఈఏ రాజు, పర్యవేక్షక ఇంజినీర్లు, యూసీడీ పీవో ప్రసన్నవాణి, డీసీవోలు, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement