అల్లిపురం: చందనోత్సవానికి 2,300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. శనివారం గోశాల సమీపంలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో చందనోత్సవ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘సామాన్య భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ, వారికి అవసరమైన సహాయం అందించాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రాంగ్ పార్కింగ్‌కు అవకాశం ఇవ్వకూడదు’అని సీపీ ఆదేశించారు. ఘాట్ రోడ్డుతో పాటు రద్దీ ప్రాంతాల్లో టోయింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచి, అడ్డంకిగా ఉన్న వాహనాలను వెంటనే తరలించాలని సూచించారు. బందోబస్తు పర్యవేక్షణలో డ్రోన్ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.


