విశాఖ సిటీ: వినియోగదారులలో విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ ఖర్చులను తగ్గించేందుకు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘ఎనర్జీ–కాస్ట్ సేవింగ్స్–డిమాండ్ రెస్పాన్స్’ అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఎలిమెంట్స్ ఎనర్జీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన 35 మంది హెచ్‌టీలో వినియోగదారులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో డిమాండ్ రెస్పాన్స్ విధానం, టైమ్ ఆఫ్ డే టారిఫ్, పీక్, ఆఫ్–పీక్ సమయాల్లో వినియోగాన్ని మార్పు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించే మార్గాలను వివరించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనదలచిన హెచ్‌టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు వివరాలకు 9445613791 నంబర్‌లో లేదా సమీప ఏపీఈపీడీసీఎల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సీజీఎం ఎస్.రాజబాబు తెలిపారు.


