దర్శన సమయాలు – టికెట్ల వివరాలు
● ఉచిత దర్శనం, రూ. 300 దర్శనం: తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ప్రారంభం.
● రూ. 1000 దర్శనం: ఉదయం 5 నుండి రాత్రి 7 వరకు (9 స్లాట్లలో)
● రూ. 1500 దర్శనం (అంతరాలయం): తెల్లవారుజామున 3.30 నుండి 5 వరకు మాత్రమే..
● రూ.1500 లఘు దర్శనం (నీలాద్రి గుమ్మం): ఉదయం 6– 7.30, 8– 9.30 వరకు.
● ప్రముఖుల దర్శనం: తెల్లవారుజామున 3.30 నుంచి 5 వరకు.
● దివ్యాంగులు: ఉదయం 10–11, సాయంత్రం 4–5 గంటల వరకు (ఒక సహాయకుడికి అనుమతి).
సింహాచలం: ఈనెల 20న శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఈవో జె.వెంకటరావు వివరాలు వెల్లడించారు.
● 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేత; కొండపైకి భక్తులు, వాహనాలు, మెట్ల మార్గం ద్వారా రాకపోకలకు అనుమతి లేదు.
● 20వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుంచి ఆర్టీసీ బస్సులకు అనుమతి; సాయంత్రం 6 తర్వాత కొండపైకి రాకపోకలు నిలిపివేత.
● దేవస్థానం 3 బస్సులు, 90 ఆర్టీసీ బస్సుల్లో ఉదయం 1 నుంచి సాయంత్రం 6 వరకు ఉచిత ప్రయాణం; తర్వాత ఖాళీ బస్సులతో భక్తులను దిగువకు తరలింపు.
● తెల్లవారుజామున 3.30 నుంచి 5 గంటల వరకు ప్రముఖులకు అంతరాలయ దర్శనం.
● సుమారు 1.5 లక్షల భక్తులు హాజరవుతారని అంచనా.
● రాత్రి 7 గంటలకు క్యూలు మూసివేత. 11 వరకు దర్శనం కొనసాగింపు.
● రాత్రి 8 గంటలకు సహస్రఘటాభిషేకం; అనంతరం చందనం సమర్పణ.
● వెహికల్ పాస్, విఐపీ వాహనాలకే ఘాట్ రోడ్డులో అనుమతి, డ్రైవర్ తప్పనిసరి.
● దేవస్థానం సిబ్బందికి 19–20 తేదీల్లో 10 ఆర్టీసీ బస్సులు.
● లడ్డు విక్రయాలు: శ్రీకృష్ణాపురం గోశాల, అడవివరం జంక్షన్, తొలిపావంచా, సింహపురి కాలనీ, శ్రీనివాసనగర్.
● దర్శనానంతరం 40 గ్రాముల లడ్డూ ఉచిత ప్రసాదంగా అందజేత.
● కొండపై 6, దిగువ 8 ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు, 6 బెడ్ ఆసుపత్రి, 20 అంబులెన్సులు.
● తాగునీరు: 165 ప్రదేశాలు (కొండపై), 20 ప్రదేశాలు (దిగువ); 4 లక్షల నీటి బాటిల్స్, మజ్జిగ, బిస్కెట్లు, పిల్లలకు పాలు.
● పోలీస్ కంట్రోల్ రూమ్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు.
● తాత్కాలిక మరుగుదొడ్లు: కొండపై 230, దిగువ 300.
● సమాచారం కోసం హెల్ప్‌లైన్: 08912954944.
● 17–22 తేదీల వరకు ఆర్జిత సేవలు రద్దు; 18–22 (20 మినహా) రాత్రి దర్శనాలు లేవు.
● టిక్కెట్ స్లాట్‌కు 2 గంటల ముందు మాత్రమే బస్సుల్లో కొండపైకి అనుమతి; స్లాట్ సమయాల్లోనే దర్శనం.
● ఆన్‌లైన్ టికెట్ల దుర్వినియోగంపై చట్టపరమైన చర్యలు.


