ఆకట్టుకున్న 100 రూపాకృతి | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న 100 రూపాకృతి

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిమ్నాజియం మైదానంలో నిర్వహించిన హ్యుమన్‌ స్పెల్‌ అవుట్‌ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఏయూ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు మైదానంలో ఒక క్రమపద్ధతిలో నిల్చొని, 100 సంఖ్య రూపాకృతిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. హ్యుమన్‌ స్పెల్‌ అవుట్‌ కార్యక్రమం వర్సిటీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య పి.కింగ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు, కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య ఎ.విజయ్‌ మోహన్‌, ఎ.పల్లవి, ఎ.ఎం.యుగంధర్‌, సి.హెచ్‌ ఆశా ఇమ్మానియల్‌ రాజు, పలు విభాగాల ప్రిన్సిపాళ్లు, డీన్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement