పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయండి

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

మహారాణిపేట: పెండింగ్‌లో ఉన్న పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు సూచించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన ముఖ్య నాయ కుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రీజనల్‌ కోఆర్డినేటర్‌ మాట్లాడుతూ.. పార్టీ సీనియర్‌ నాయ కులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వార్డు, సచివాలయ కమిటీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రజల సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించేలా నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అందరూ సమష్టిగా పనిచేయా లని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ డిప్యూటీ సీఎం పి.పుష్పశ్రీవాణి, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌, మజ్జి శ్రీనివాసరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, మొల్లి అప్పా రావు, దేవన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, శోభ హైమావతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, రొంగలి జగన్నాథం, సతీష్‌ వర్మ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ కన్నబాబు

Advertisement
 
Advertisement
Advertisement