మహారాణిపేట: మత్స్యకారుల సేవలో పథకం అమలు కోసం శుక్రవారం మత్స్య శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించారు. జిల్లాలోని 15 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ఈ ప్రక్రియ కొనసాగింది. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు పర్యవేక్షణలో డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆశాజ్యోతి, ఇతర సిబ్బంది జిల్లాలోని 698 మరపడవలు, 1,324 మోటారు బోట్లు, 428 ఇంజిన్ లేని బోట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోటు రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆధార్ వివరాలతో పాటు బోటులో పనిచేసే కలాసీల పూర్తి వివరాలను సేకరించారు. కాగా.. గత ఏడాది జిల్లాలో 12,135 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాదికి అర్హులను ఎంపిక చేయడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించినట్లు జేడీ తెలిపారు.


