మహారాణిపేట: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శనివారం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. ఎండాడ సన్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన నిర్మించనున్న జ్యుడీషియల్ బిల్డింగ్ శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు అనే విషయాలను పక్కాగా తెలుసుకొని దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని భీమిలి ఆర్డీవో సుధా సాగర్, జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


