వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, క్లస్టర్‌ కమిటీల్లో పలువురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, క్లస్టర్‌ కమిటీల్లో పలువురికి చోటు

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట్ర, జిల్లా, డివిజన్‌, క్లస్టర్‌ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా కరణం కృష్ణ(విశాఖ నార్త్‌), రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా తాటికొండ జగదీష్‌(గాజువాక)ను నియమించారు. జిల్లా పబ్లిక్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శిగా గుడ్ల నరసింగరావు(విశాఖ తూర్పు), 1వ డివిజన్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా జె.ప్రసాద్‌(భీమిలి), 2వ డివిజన్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా చిల్లా భాస్కర్‌ రెడ్డి(భీమిలి), 3వ వార్డు ప్రెసిడెంగ్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా అలిపిరి నరసింగ్‌రావు, 4వ డివిజన్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా దౌలపల్లి ఏడు కొండలరావును నియమించారు.

క్లస్టర్‌ బూత్‌ కమిటీలు ఏర్పాటు

క్లస్టర్‌–1(64వ, 65వ, 74వ, 75వ, 76వ వార్డు) ఇన్‌చార్జిగా పేడాడ వెంకటేష్‌ ప్రసాద్‌, క్లస్టర్‌–2(85వ, 86వ, 87వ, 88వ వార్డు) ఇన్‌చార్జిగా ఆర్‌.కుమార్‌ స్వామి, క్లస్టర్‌–3(66వ, 71వ, 72వ, 73వ వార్డు) ఇన్‌చార్జిగా ఎం సుధీర్‌రామశివకుమార్‌, క్లస్టర్‌–4(77వ, 78వ, 79వ వార్డు) ఇన్‌ఛార్జిగా వి.ఏ.వి వర ప్రసాద్‌, క్లస్టర్‌–5(67వ, 68వ, 69వ, 70వ వార్డు) ఇన్‌చార్జిగా కల్లూరు సత్యప్రసాద్‌ను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement