కేజీబీవీ విద్యార్థిని ప్రణతి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థిని ప్రణతి ప్రతిభ

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

భీమునిపట్నం: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రతిభ చూపిన భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)విద్యార్థిని సిరపరపు ప్రణతిని బుధవారం కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అభినందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు కేజీబీవీల్లో ఈ విద్యార్థిని 979 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ గంగాకుమారి ఆ విద్యార్థినిని కలెక్టర్‌ వద్దకు తీసుకువెళ్లారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ జె.చంద్రశేఖర్‌ తదితరులు కూడా ప్రణతిని అభినందించారు.

కలెక్టర్‌ ప్రశంసలు

Advertisement
 
Advertisement
Advertisement